నేను చాలా సేపు ఎదురుచూశాను..! తర్వాత బాత్రూమ్ తలుపు తట్టాను. నా స్నేహితురాలి వల్ల తప్పించుకున్నాను.. భారతీయ రైలులో ఒక విదేశీ మహిళకు జరిగిన దారుణం.. భయంకరమైన వీడియో.

ప్రయాణం: ఇండియాలో పర్యాటక యాత్రలో ఉన్న ‘ఈనస్ ఫారియా’ అనే విదేశీ మహిళ, రైలు ప్రయాణంలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ ఘటన భారతీయ రైల్వేలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

అసలేం జరిగింది? ఈనస్ ఫారియా తన స్నేహితుడితో కలిసి రైలులోని 3-టైర్ ఏసీ (3AC) కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఆమెకు ఎదురుగా కూర్చున్న 4-5 మంది యువకుల ముఠా ఆమెను అసభ్యంగా, అసౌకర్యంగా చూస్తూ వేధించారు. ఈనస్ అక్కడి నుండి తప్పించుకోవడానికి రైలులోని మరొక బోగీలో ఉన్న బాత్‌రూమ్‌కు వెళ్లగా, ఆ గుంపులోని ఒక వ్యక్తి ఆమెను వెంబడించి, బాత్‌రూమ్ తలుపులు తీయమని బలవంతం చేశాడు.

సకాలంలో స్పందించిన స్నేహితుడు: అదృష్టవశాత్తూ, ఆ వ్యక్తి ఆమెను వెంబడించడాన్ని గమనించిన ఈనస్ స్నేహితుడు, వెంటనే అక్కడికి చేరుకుని బయటే నిలబడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయంపై వారు వెంటనే రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని వారిని 2AC కోచ్‌లోకి మార్చి సహాయం అందించారు.

నెటిజన్ల ఆవేదన: తమకు సహాయం చేసిన రైల్వే సిబ్బందికి ఈనస్ ఫారియా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, డబ్బు చెల్లించి ప్రయాణించే ఏసీ కోచ్‌లలోనే మహిళలకు ఇటువంటి అభద్రత ఏర్పడటం దురదృష్టకరమని, బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: