ఎన్విడియా (Nvidia) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జెన్సన్ హువాంగ్.. చైనాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఎలిస్ హువాంగ్‌తో తనకు ఉన్న సంబంధాన్ని అంగీకరిస్తూ, తన భార్య, పిల్లలతో పాటు సంస్థ ఉద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.
చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా నిఘా సంస్థలు అనుమానిస్తున్న ఎలిస్ హువాంగ్‌తో తనకు సంబంధం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్.. తాను చేసిన తప్పుకు ఎలాంటి కారణాలూ, సాకులూ చెప్పలేనని, తన చర్యకు తీవ్రంగా చింతిస్తున్నానని ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
అత్యాధునిక ఏఐ (AI) చిప్‌లను ఉత్పత్తి చేసే ప్రపంచ అగ్రశ్రేణి సంస్థ అయిన ఎన్విడియా.. అమెరికా ఎగుమతి ఆంక్షలను ఉల్లంఘించి చైనాకు చిప్‌లను సరఫరా చేసిందా? దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఏమైనా లీక్ అయ్యాయా? అనే విషయాలపై దర్యాప్తు చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన కథనం ఆధారంగా అమెరికా చట్టసభ ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర దృష్టి సారించారు. అయితే, సంస్థకు చెందిన ఎలాంటి రహస్య డేటా గానీ, అమెరికా జాతీయ భద్రత గానీ ప్రమాదంలో పడలేదని ఎన్విడియా యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ గొప్ప వ్యక్తి అని, ఆయన అమెరికాకు ఎంతో అద్భుతమైన సేవలు అందించారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి మద్దతుగా వ్యాఖ్యానించడం గమనార్హం.

Leave a Reply