“నైట్ క్లబ్ అంటే డ్యాన్స్ చేయాలని ఎవరు చెప్పారు..?” చేతిలో పుస్తకంతో క్లబ్‌లకు క్యూ కడుతున్న జపాన్ యువత.. నెట్టింట వైరల్ అవుతున్న ‘జూసీ బుక్ రేవ్’..!!

జపాన్‌లో ప్రజలు ఇప్పుడు డ్యాన్స్ చేయడానికో, గట్టిగా అరుస్తూ మాట్లాడుకోవడానికో కాకుండా.. ప్రశాంతంగా కూర్చుని పుస్తకాలు చదువుకోవడానికి నైట్ క్లబ్‌లకు వెళ్లే సరికొత్త సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది.

టోక్యోలోని షిమోకిటాజావా (Shimokitazawa) ప్రాంతంలో ఉన్న ఓ అండర్‌గ్రౌండ్ నైట్ క్లబ్‌లో ‘జూసీ బుక్ రేవ్’ (Juicy Book Rave) పేరుతో ఈ వినూత్న కార్యక్రమం జరుగుతోంది.

ఇక్కడికి వచ్చే వారు చేతిలో ఓ పుస్తకంతో వస్తారు. సాధారణంగా నైట్ క్లబ్‌లలో ఉండే మిరుమిట్లు గొలిపే లైట్ల స్థానంలో, ఇక్కడ పుస్తకం చదువుకోవడానికి వీలుగా మందమైన, ప్రశాంతమైన వెలుతురు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేశారు.

డీజే (DJ) ప్లే చేసే మৃదువైన యాంబియంట్ సంగీతం (Ambient Music) నేపథ్యంలో, ఇందులో పాల్గొనే వారంతా నిశ్శబ్దంగా కూర్చుని తమకు నచ్చిన పుస్తకాలను చదువుకుంటారు.

పక్కన ఉన్నవారితో మాట్లాడటానికి గట్టిగా అరవాల్సిన అవసరం గానీ, డ్యాన్స్ చేయాల్సిన నిర్బంధం గానీ లేకుండా.. సంగీతంతో పాటు ప్రశాంతంగా రాత్రిని గడిపే ఈ కొత్త ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *