నోటి దుర్వాసనను పోగొట్టడానికి చేయవలసిన పనులు

చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో నోటి దుర్వాసన ఒకటి. ఇది పది మందిలోకి వెళ్లినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు, వాటిని గుర్తించి పరిష్కరించుకోవడం ముఖ్యం. నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

  1. రెండుసార్లు బ్రష్ చేయండి: రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి. నాలుకను కూడా శుభ్రం చేయండి, ఎందుకంటే బ్యాక్టీరియా నాలుకపై చేరి దుర్వాసనను కలిగిస్తుంది.
  2. మౌత్ వాష్ వాడండి: బ్యాక్టీరియాను చంపడానికి యాంటీ-మైక్రోబియల్ లేదా యాంటీ-బ్యాక్టీరియల్ మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోండి.
  3. నీరు ఎక్కువగా తాగండి: నోరు ఆరిపోవడం వల్ల దుర్వాసన పెరుగుతుంది. కాబట్టి రోజూ ధారాళంగా నీరు తాగాలి.
  4. ఈ ఆహారాలను నివారించండి: వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారం మరియు అసిడిక్ స్వభావం ఉన్న ఆహారాలు దుర్వాసనకు కారణమవుతాయి. వీటి వాడకాన్ని తగ్గించండి.
  5. ధూమపానం వదిలేయండి: పొగతాగడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.
  6. మద్యపానానికి దూరంగా ఉండండి: మద్యం సేవించడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు.
  7. యాలకులు: భోజనం తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు నమలడం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
  8. లవంగాలు: భోజనం తర్వాత లవంగాలు నమలడం కూడా దుర్వాసనను తగ్గిస్తుంది.
  9. పుదీనా: పుదీనా ఆకులు నమలడం లేదా పుదీనా టీ తాగడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
  10. సోంపు (పెద్ద జీలకర్ర): భోజనం తర్వాత కొద్దిగా సోంపు తినడం అలవాటు చేసుకోండి. ఇది నోటిని తాజాగా ఉంచుతుంది.

Posted

in

by

Tags: