“న్యూయార్క్ ఓడిపోయింది”.. మెట్రోలో భారతీయ మహిళల భద్రతను చూసి ఆశ్చర్యపోయిన విదేశీ ప్రయాణికురాలు! వైరల్ వీడియో

ముంబై: అమెరికాకు చెందిన ‘లిజ్’ అనే మహిళా పర్యాటకురాలు మొదటిసారి ముంబై మెట్రో రైలులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ముంబైలోని విపరీతమైన ఎండల మధ్య, మెట్రో రైలు లోపల ఉన్న చల్లని ఏసీ (AC) సౌకర్యం ఆమెకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీ మెట్రో రైళ్లతో పోలిస్తే.. ముంబై మెట్రోలో ఉన్న అసాధారణమైన పరిశుభ్రత ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది.

“అమెరికా.. ఇండియాని చూసి నేర్చుకోవాలి”:
ముంబై మెట్రోలోని సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయిన లిజ్.. “ముంబై మెట్రో న్యూయార్క్ మెట్రో కంటే చాలా చాలా క్లీన్‌గా (పరిశుభ్రంగా) ఉంది. ఈ విషయంలో అమెరికా.. భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి” అంటూ తన సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మెట్రో ప్రయాణంలో మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ‘లేడీస్ స్పెషల్ కోచ్’ (మహిళల ప్రత్యేక బోగీ) ఉండటాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తాను ఇప్పటివరకు ప్రయాణించిన ఇతర దేశాలలో ఇలాంటి అద్భుతమైన సౌకర్యాన్ని ఎక్కడా చూడలేదని, మహిళల భద్రత కోసం భారతదేశం తీసుకున్న ఈ చొరవ చాలా గొప్పదని ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, భారతీయ నెటిజన్లు ఎంతో గర్వంగా తమ అభిప్రాయాలను మరియు కామెంట్లలను పంచుకుంటున్నారు.


Posted

in

by

Tags: