థాయిలాండ్‌లోని నోంతబురి ప్రావిన్స్‌లోని దెబ్సిరిన్ నోంతబురి హైస్కూల్లో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం వెలువడింది.
బ్యాంకాక్ నగరానికి వాయవ్యంగా దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంగ్ క్రుయ్ జిల్లాలోని ఈ పాఠశాలలో, అదే పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి హఠాత్తుగా కాల్పులు జరిపాడు. దాడి తర్వాత, ఆ భవనంలోని మూడో అంతస్తులో ఆ విద్యార్థి తనను తాను గదిలో బంధించుకున్నట్లు ప్రాథమిక వార్తలు తెలుపుతున్నాయి.
ఈ సంఘటన అనంతరం గాయపడిన వారిని వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో, దాడికి పాల్పడిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు నోంతబురి ప్రావిన్స్ పోలీస్ చీఫ్ ధ్రువీకరించారు. ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు గల కారణాలపై థాయిలాండ్ పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply