పడకపై నుండి లేవగానే తల తిరుగుతోందా? కూర్చుంటే కళ్లు తిరుగుతున్నాయా? జాగ్రత్త.. ఇది కేవలం నీరసం మాత్రమే కాదు!

చాలా మందికి నిద్రలేవగానే పడకపై నుండి లేచేటప్పుడు తల తిరగడం (Dizziness) అనిపిస్తుంది. అలాగే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని అకస్మాత్తుగా నిలబడ్డప్పుడు కూడా కళ్లు తిరిగినట్లు ఉంటుంది. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ అరుదుగా యువకుల్లో కూడా సంభవించవచ్చు. దీనికి ప్రధాన కారణం రక్తపోటు (Blood Pressure) లో వచ్చే మార్పులు. దీనిని వైద్య పరిభాషలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ (Orthostatic Hypotension) అంటారు.

దీనిని నివారించడానికి అనుసరించాల్సిన 6 మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

1. నిదానంగా లేవండి: కుర్చీలో నుండి లేదా మంచం నుండి లేచేటప్పుడు అకస్మాత్తుగా నిలబడకూడదు. అలా నిలబడినప్పుడు కాళ్ల నుండి గుండెకు రక్తం ప్రవహించే వేగంలో మార్పు వచ్చి తల తిరగడం, మూర్ఛ రావడం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ నిదానంగా, ఒక ఆధారాన్ని పట్టుకుని లేవాలి.

2. మందుల ప్రభావం: మీరు ఏదైనా వ్యాధికి సుదీర్ఘకాలం మందులు వాడుతుంటే, ఆ మందుల ప్రభావం వల్ల కూడా ఇలా జరగవచ్చు. అటువంటప్పుడు వైద్యుడిని సంప్రదించి మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవడం లేదా అవసరం లేని పక్షంలో వాటిని ఆపివేయడం చేయాలి.

3. కొద్దికొద్దిగా ఆహారం తీసుకోండి: ఒకేసారి కడుపు నిండా తినడం వల్ల కూడా ఒక రకమైన మత్తు లేదా మూర్ఛ రావచ్చు. ఆహారాన్ని ఒకేసారి కాకుండా తక్కువ పరిమాణంలో, ఎక్కువ సార్లు (చిన్న విరామాలలో) తీసుకోవడం వల్ల ఈ సమస్యను అరికట్టవచ్చు.

4. నీరు ఎక్కువగా త్రాగాలి: శరీరంలో నీటి శాతం తగ్గడం (Dehydration) వల్ల రక్తపోటులో మార్పులు వస్తాయి. పగటిపూట తగినంత నీరు త్రాగడం వల్ల రక్త ప్రసరణ సీరాగా ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల పడకపై నుండి లేవగానే తల తిరగడం సర్వసాధారణం.

5. వ్యాయామం: రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం అంతటా రక్త ప్రసరణ క్రమబద్ధంగా జరుగుతుంది. అయితే నిద్రలేవగానే వెంటనే కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. శరీరాన్ని కొద్దిసేపు వార్మ్ అప్ (Warm-up) చేసిన తర్వాతే వ్యాయామం ప్రారంభించాలి.

6. ఎండ నుండి రక్షణ: ఎక్కువ సేపు ఎండలో నిలబడి పని చేయడం మానుకోవాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు వాడటం మరియు ఎప్పుడూ వెంట ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవడం చాలా ముఖ్యం.


Posted

in

by

Tags: