న్యూఢిల్లీ/టెల్ అవీవ్: దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా భారత ఉపఖండంలో ఉగ్రవాదానికి ఊపిరిపోస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు తన గోతిని తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్‌ను “క్యాన్సర్” అంటూ అభివర్ణించిన పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ప్రపంచం నివ్వెరపోయేలా ఇజ్రాయెల్ తన విదేశాంగ విధానాన్ని మార్చేసింది. హమాస్‌ను ఏ విధంగానైతే భూస్థాపితం చేసిందో, ఇప్పుడు పాకిస్థాన్‌ను అదే స్థాయిలో నామరూపాలు లేకుండా చేస్తామంటూ నెతన్యాహు ప్రభుత్వం ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఒక్క ట్వీట్.. తెచ్చింది పెను ముప్పు!
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్ ఇప్పుడు ఆ దేశ ఉనికినే ప్రమాదంలో పడేసింది. ఇజ్రాయెల్‌ను “మానవాళికి శాపం” అని, ఆ దేశాన్ని సృష్టించిన వారు నరకంలో కాలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఇజ్రాయెల్ నిప్పులు చెరిగింది. “ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ అన్న వారే తుడిచిపెట్టుకుపోతారు” అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడోన్ సార్ హెచ్చరించారు. చరిత్రలో మొదటిసారిగా పాకిస్థాన్‌ను అధికారికంగా ఒక “ఉగ్రవాద దేశం” (Terrorist Country) అని ఇజ్రాయెల్ సంబోధించడం గమనార్హం.
భారత్-అమెరికా-ఇజ్రాయెల్: ఏదో జరుగుతోంది!
ఇజ్రాయెల్ తన అత్యంత శక్తివంతమైన గూఢచారి సంస్థ ‘మొసాద్’ (Mossad)కు తదుపరి టార్గెట్ పాకిస్థాన్ అని సూచించినట్లు వస్తున్న వార్తలు ప్రపంచ దేశాల్లో హడల్ పుట్టిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడ అమెరికా ఎయిర్ ఫోర్స్ చీఫ్‌తో భేటీ కావడం అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది.
- వ్యూహాత్మక అడుగు: ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా తన పరాక్రమాన్ని చాటిన ఎయిర్ చీఫ్ అమెరికా వెళ్లడం వెనుక.. పాకిస్థాన్‌పై తీసుకోబోయే సంయుక్త చర్యల సమాచారాన్ని అమెరికాకు చేరవేయడమేనా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
“మీరు మధ్యవర్తి కాదు.. మీరే ఒక సమస్య!”
ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుపుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్థాన్‌కు అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెల్ మైఖేల్ లీడర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “మీరు మధ్యవర్తులు కాదు, మీరే ప్రపంచానికి అసలైన సమస్య. ఇరాన్ నాయకుల్లాగే మీరు మా మరణాన్ని కోరుకుంటున్నారు” అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం వేలాది మంది ఇజ్రాయెలీలు పాకిస్థాన్‌ను మ్యాప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
