పాన్ కార్డ్ ఉన్నవారికి హెచ్చరిక.. ఏప్రిల్ 1 నుండి మారనున్న నిబంధనలు..!!

పాన్ కార్డ్ (Permanent Account Number) అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే 10 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. పన్ను చెల్లింపులు, బ్యాంక్ ఖాతా ప్రారంభించడం మరియు పెద్ద ఆర్థిక లావాదేవీలకు ఇది తప్పనిసరి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘కొత్త ఆదాయపు పన్ను ముసాయిదా చట్టం 2025’ ద్వారా పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనలలో కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి.

ముఖ్యమైన మార్పులు ఇవే:

  • నగదు డిపాజిట్లు: ఇప్పటివరకు ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉండేది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగితే అవి నేరుగా ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణలోకి వెళ్తాయి.
  • ఆస్తుల కొనుగోలు: స్థిరాస్తుల కొనుగోలు లేదా అమ్మకం సమయంలో పాన్ కార్డ్ సమర్పించాల్సిన పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచారు.
  • వాహనాల కొనుగోలు: గతంలో వాహనం ధ ధరతో సంబంధం లేకుండా పాన్ కార్డ్ అడిగేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం, రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన ద్విచక్ర వాహనాలు లేదా కార్లు కొంటేనే పాన్ కార్డ్ తప్పనిసరి.
  • హోటల్ బిల్లులు: లగ్జరీ హోటళ్లలో బిల్లు రూ. 50,000 దాటితే పాన్ కార్డ్ అడిగేవారు. ఇకపై ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచారు. దీనివల్ల విలాసవంతమైన ఖర్చులపై ప్రభుత్వం నిఘా ఉంచనుంది.
  • భీమా ప్రీమియం: ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 50,000 దాటితే పాన్ కార్డ్ ఇవ్వాలనే నిబంధనను కూడా సవరించి, ఆ పరిమితిని పెంచనున్నారు.

ఈ మార్పులన్నీ పారదర్శకతను పెంచడానికి మరియు పన్ను ఎగవేతదారులను గుర్తించడానికి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను ఫిబ్రవరి 22 వరకు తెలియజేయవచ్చు.


Posted

in

by

Tags: