పాపం ఆ పసిపాప..! “కొరికి పీక్కుతిన్న వీధికుక్క”.. భయంతో అల్లాడిపోయిన 2 ఏళ్ల చిన్నారి.. !!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న శివాంక్షి రామేశ్వర్ గోలప్ అనే 2 ఏళ్ల పసికందుపై, ఆ ప్రాంతంలో తిరుగుతున్న వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసి విచక్షణారహితంగా కొరికి పీక్కుతింది.

చిన్నారి పెట్టిన గుండెలు పగిలే ఆర్తనాదాలు విన్న స్థానికులు పరుగున వచ్చి, కుక్కను బెదిరించి తరిమికొట్టి తీవ్రంగా గాయపడిన పాపను రక్షించారు.

ఆ వెంటనే తీవ్ర గాయాలపాలైన శివాంక్షిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూ (తీవ్ర చికిత్స విభాగం) లో వైద్యులు నిరంతర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని, విషాదాన్ని నింపింది. రోజురోజుకూ పెరిగిపోతున్న వీధికుక్కల బెడదను అరికట్టేందుకు స్థానిక మున్సిపల్ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *