“పాపం ఒకరిది.. నింద మరొకరిది..!” 16 రోజుల జైలు జీవితం.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం.. ఫార్మా వ్యాపారి హత్య కేసులో పోలీసుల సంచలన ‘యూ-టర్న్’.. కన్న కొడుకే చేసిన ఘోర ద్రోహం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఫార్మా వ్యాపారి వినీత్ మనోచా గత సెప్టెంబర్ 5వ తేదీన దారుణ హత్యకు గురైన కేసులో.. కాన్పూర్ పోలీసులు తీసుకున్న సంచలన ‘యూ-టర్న్’ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ దారుణ హత్యలో వ్యాపారి కోడలు శాలునే నిందితురాలని పేర్కొంటూ, పోలీసులు హడావుడిగా ఆమెను అరెస్ట్ చేసి 16 రోజుల పాటు జైల్లో పెట్టారు. అయితే, తాజాగా జరిపిన లోతైన దర్యాప్తులో శాలు పూర్తిగా నిర్దోషి అని, వ్యాపారి సొంత కుమారుడైన సుబ్రత్ మనోచానే తన తండ్రిని చంపడానికి కుట్ర పన్నిన అసలు నేరస్తుడని పోలీసులు ప్రకటించారు.

తండ్రి ముఖంపై దిండుతో అదిమి చంపేసి, సహజ మరణంగా చిత్రీకరించాలని సుబ్రత్ ప్లాన్ చేశాడు. కానీ, కిరాయి హంతకులను చూడగానే తండ్రి కేకలు వేయడంతో, భయపడిపోయిన హంతకులు ఆయనను కత్తితో పొడిచి చంపేశారు. రూ.40 లక్షల అప్పు, తండ్రి ఆస్తి చేజారిపోతుందేమోనన్న భయంతోనే ఈ ద్రోహానికి పాల్పడినట్లు కుమారుడు వాంగ్మూలం ఇచ్చాడు.

అసలు నేరస్తుడైన కిరాయి హంతకుడిని అరెస్ట్ చేసినప్పుడు, తాను తప్పించుకునే ప్లాన్‌లో భాగంగా కోడలు శాలు పేరు చెప్పాడు. ఇది విన్న పోలీసులు కూడా, ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో నిర్దోషి అయిన శాలును అరెస్ట్ చేసి జైలుకు పంపి తీవ్ర అవమానానికి గురిచేశారు.

ఇప్పుడు అసలు నిజం బయటపడినప్పటికీ, చేయని నేరానికి 16 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి, మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర నిందలు మోసిన ఆ మహిళ జీవితానికి ఎవరు సమాధానం చెబుతారని నెటిజన్లు కాన్పూర్ పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *