సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సరదాగా ఉంటే, మరికొన్ని గుండెల్ని కలచివేసే విధంగా ఉంటాయి. ఆ కోవలోనే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసేవారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఆ వీడియోలో, కేవలం 3 నెలల ఆడపాప కాలును ఆ పాప సొంత మేనత్తే విరగ్గొట్టింది.
పాప తల్లి బిడ్డను వదిలి కొంచెం దూరం వెళ్లినప్పుడల్లా, హఠాత్తుగా పాప గట్టిగా ఏడ్చే శబ్దం వినిపించేది. దీనిపై అనుమానం వచ్చిన తల్లి, పాప పడుకున్న చోట రహస్యంగా కెమెరా ఆన్ చేసి పెట్టి, తాను స్నానానికి వెళ్లింది. ఎప్పటిలాగే పాప ఏడుపు వినపడటంతో పరిగెత్తుకుంటూ వచ్చిన ఆమె.. తాను ఆన్ చేసి పెట్టిన కెమెరాలో రికార్డైన దృశ్యాలను చూసి నిశ్చేష్టురాలైంది.
పాప ప్రశాంతంగా ఉన్న సమయంలో, ఆమె సొంత మేనత్తే కావాలనే పాప కాలును పట్టుకుని గట్టిగా విరిచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో, “ఈ రోజుల్లో సొంత బంధువులను కూడా నమ్మలేం” అంటూ నెటిజన్లు తీవ్ర ఆవేదనతో కామెంట్లు పెడుతున్నారు.
