“పార్శిల్ తీసుకోవడానికి వచ్చిన ఊబర్ ఉద్యోగి. ఇంట్లో సిగరెట్ తాగొచ్చా? బెంగళూరు ఇన్‌ఫ్లూయెన్సర్ విడుదల చేసిన షాకింగ్ వీడియో.!!!”

బెంగళూరులో ఊబర్ పార్శిల్ సర్వీస్ ఉద్యోగి ఒకరిపై ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అనేరి ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు.

తన ఇంటికి పార్శిల్ తీసుకోవడానికి వచ్చిన ఉద్యోగి మద్యం మత్తులో ఉన్నాడని, దీని వల్ల తనకు భయాందోళనకరమైన పరిస్థితి ఎదురైందని ఆమె చెప్పారు. ఈ సంఘటనను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో రూపంలో విడుదల చేశారు.

లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న అనేరి ఠాకూర్, ఈ ఘటనను “ప్రమాదకరమైన అనుభవం” అని పేర్కొన్నారు. తన ఇంట్లో ఉన్న తన స్నేహితురాలు జ్యాకెట్ మరచిపోగా, దానిని తిరిగి పంపడానికి రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఊబర్ పార్శిల్ సర్వీస్‌ను బుక్ చేసినట్లు ఆమె తెలిపారు.

పార్శిల్‌ను తీసుకెళ్లడానికి వచ్చిన ఉద్యోగి ఇంటికి వచ్చినప్పుడు మద్యం మత్తులో ఉన్నాడని, ఆ సమయంలో ఆయన తన వద్ద ఇంట్లో సిగరెట్ తాగొచ్చా అని అడిగారని అనేరి ఠాకూర్ తెలిపారు. ఈ ఘటన తనకు తీవ్ర అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగించిందని ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఊబర్ పార్శిల్ ఉద్యోగి గురించి పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన ఆరోపణలపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటనపై చర్చ కొనసాగుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *