బెంగళూరులో నేడు జరిగిన ఒక ఘోర ప్రమాదం నగరాన్నంతటినీ విషాదంలో ముంచెత్తింది. బెంగళూరు సాయుధ దళాల విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగనగౌడ, నేడు ఉదయం సుమారు 8 గంటల సమయంలో తన 2 ఏళ్ల కుమార్తె వర్ష మరియు 4 ఏళ్ల అన్న కుమార్తె భానును బైక్‌పై ఎక్కించుకుని పాలు కొనడానికి వెళ్లారు.
హెన్నూరు పోలీస్ క్వార్టర్స్ సమీపంలో వారు వెళ్తుండగా, మలుపు తిరుగుతున్న ఒక స్కూల్ బస్సు ఊహించని విధంగా వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
దీంతో బైక్ పైనుంచి కింద పడిపోయిన ఇద్దరు చిన్నారులపై బస్సు వెనుక చక్రం ఎక్కడంతో, ఆ ఇద్దరు పసిపాపలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ల ముందే పిల్లలు నలిగిపోయి మరణించడం చూసి ఆ తండ్రి తల్లడిల్లిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, స్కూల్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
