పిచ్చోడివా ఏంట్రా నువ్వు..! “పామును పట్టుకుని దాని నోట్లోకి బొటనవేలు పెట్టిన యువకుడు”.. తలకెక్కిన రీల్స్ పిచ్చి.. వెంటవెంటనే 3 సార్లు కాటేసిన నాగుపాము.. వెన్నులో వణుకు పుట్టించే సీన్..!!

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత చేసే పిచ్చి పనులు రోజురోజుకూ హద్దులు దాటిపోతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన.. రీల్స్ మోజు మనుషులను ఎంతటి ప్రమాదంలోకి నెడుతుందో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచింది.

అచల్దా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక దుకాణం వద్ద హఠాత్తుగా విషసర్పం కనిపించింది. స్థానికుడైన రిషి పోర్వాల్ (25) అనే యువకుడు ఏమాత్రం భయం లేకుండా ఆ పామును చేతులతో పట్టుకున్నాడు. దాన్ని జనావాసాలు లేని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేస్తానని మొదట్లో చెప్పాడు.

కానీ వెళ్లే దారిలోనే అతడి బుర్రలోకి విపరీతమైన ఆలోచన వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ కావాలనే ‘రీల్స్ పిచ్చి’ తలకెక్కడంతో.. పాముతో స్టంట్లు చేస్తూ వీడియో తీయాలని స్నేహితులను కోరాడు. వీడియో షూట్ చేస్తూ మరింత రెచ్చిపోయిన రిషి, అందరూ భయంతో గడ్డకట్టుకుపోయేలాంటి పిచ్చి పని చేశాడు. పాము తలతో ఆడుకుంటూ ఏకంగా దాని నోట్లోకి తన బొటనవేలును జొప్పించాడు!

ప్రమాదాన్ని పసిగట్టిన ఆ పాము ఒక్కసారిగా ఆగ్రహంతో రిషి వేలిని బలంగా కాటేసింది. నొప్పితో విలవిల్లాడుతూ అతడు చెయ్యి వెనక్కి లాగేందుకు ప్రయత్నించగా.. ఆ పాము క్షణాల వ్యవధిలోనే వెంటవెంటనే మూడుసార్లు అతడి చేతిని కాటేసింది. క్షణాల్లో రిషి ముఖంలో నవ్వు మాయమై భయం గూడుకట్టుకుంది. వెంటనే ఆ పామును దూరంగా విసిరేయడంతో అది పొదల్లోకి వెళ్లిపోయింది.

ఈ భయానక దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు నిశ్చేష్టులయ్యారు. మొదట్లో నవ్వుతూ షో చేసిన రిషి.. చుట్టుపక్కల వారు హెచ్చరించేసరికి తాను చేసిన మూర్ఖపు పనిని తెలుసుకుని భయంతో వణికిపోయాడు. అయితే, పాము కాటు వేసినప్పటికీ ఆ యువకుడు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోకపోవడం గమనార్హం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *