రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన పిల్లల మాటలు విని భావోద్వేగానికి గురయ్యారంటూ ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల ఎదుగుదల చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి అంటూ ఈ కథనంలో పేర్కొన్నారు.
డిజిటల్, టెలికాం రంగాల్లో కీలక సంస్థగా ఎదిగిన జియో ప్రస్థానాన్ని పురస్కరించుకుని భారీ వేడుక నిర్వహించినట్లు తమిళ కథనం చెబుతోంది. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారని, జియో అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలు, సంస్థ నిర్మాణంలో తమ తండ్రి పాత్ర గురించి ఆయన పిల్లలు వేదికపై మాట్లాడారని పేర్కొంది.
పిల్లలు పరిణతితో మాట్లాడటం, సంస్థ భవిష్యత్తుపై తమ ఆలోచనలను వివరించడం చూసి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారని కథనం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోందని తెలిపింది.

Leave a Reply