పుట్టగానే తలైవర్ పోజ్.. ‘నరసింహ’ స్టైల్‌లో అదరగొట్టిన పసిబిడ్డ.. వేరే లెవల్ పోజ్.. డాక్టర్‌నే ఆశ్చర్యపరిచిన అద్భుతం.. ముచ్చటగొలిపే వీడియో.!

ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక నవజాత శిశువు, పుట్టిన తర్వాత చేసిన వైద్య పరీక్షల అనంతరం ఎంతో ప్రశాంతంగా, ఏ బెంగా లేకుండా రిలాక్స్‌గా పడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ పసికందు చూపించిన ఈ ప్రశాంతమైన, కూల్ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

కైరో నగరానికి చెందిన ప్రముఖ శిశువైద్య నిపుణులు డాక్టర్ ఇస్లాం ఎల్డే తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. సాధారణంగా పుట్టిన పసిపిల్లలు ఏడవడం, కాళ్లూ చేతులూ ఆడించడం, కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నించడం సహజం. కానీ, ఈ చిన్నారి మాత్రం లోకంతో ఏ పనీ లేనట్లు, ఏదో లోతైన ఆలోచనలో మునిగినట్లు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉంది.

చిన్నారికి సంబంధించిన ఈ ప్రశాంతమైన, ‘నిశ్చింత’ భంగిమను చూసిన నెటిజన్లు రకరకాలుగా మురిసిపోతూ మీమ్స్, కామెంట్లను షేర్ చేస్తున్నారు. ‘ఈ బిడ్డ పుట్టగానే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లుంది’, ‘మొదటి రోజే తన ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్ణయించుకున్నాడు’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

వైద్యపరంగా చూస్తే, నవజాత శిశువులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇలాంటి పలు రకాల కదలికలు, ముఖ కవళికలు ప్రదర్శించడం సహజమే. అయినప్పటికీ, ఈ బుజ్జాయి ఇచ్చిన కూల్ పోజ్ నెటిజన్లను నవ్విస్తూ, ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *