పుష్పా సినిమా కూడా ఫెయిల్! బీహార్‌లో రైలు చక్రాల వద్ద మద్యం స్మగ్లింగ్.. ఆ స్థావరం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! (వీడియో)

బీహార్ మద్యం స్మగ్లింగ్: మద్యపాన నిషేధం ఉన్న బీహార్ రాష్ట్రంలో మద్యం స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు వాడే రకరకాల వింత పద్ధతుల గురించి మీరు వినే ఉంటారు. కానీ తాజాగా కటిహార్‌లో బయటపడిన ఒక ఉదంతం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాధారణంగా రైళ్లలో మద్యం సీసాలను బ్యాగుల్లోనో, సీట్ల కిందనో దాచి తరలిస్తుంటారు. కానీ ఇక్కడి స్మగ్లర్లు ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా లోకల్ రైలు భోగీ కింద, చక్రాల సమీపంలో ఉన్న ఒక ఖాళీ రంధ్రం (హోల్) లో మద్యం సీసాలను దాచి తరలించారు. కటిహార్ జంక్షన్‌లో మంగళవారం ఎక్సైజ్ శాఖ మరియు రైల్వే పోలీసులు జరిపిన సంయుక్త దాడుల్లో, బెంగాల్ నుండి వస్తున్న ‘హాటే బజార్’ ఎక్స్‌ప్రెస్ జనరల్ భోగీ కింద ఈ మద్యం నిల్వలు బయటపడ్డాయి.

హోలీ వేళ పెరిగిన స్మగ్లింగ్
బీహార్‌లో హోలీ పండుగ దగ్గర పడుతుండటంతో మద్యం అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిఘా పెంచడంతో స్మగ్లర్లు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే రైలు చక్రాల వద్ద మద్యం దాచడం వంటి ‘నింజా టెక్నిక్’ను వాడారు. పోలీసులు జరిపిన ఈ దాడిలో మొత్తం 112 లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేవలం భోగీ కింద నుండే 95.640 లీటర్ల మద్యం దొరికింది.

ఎక్సైజ్ అధికారి మాటల్లో..
కటిహార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుభాష్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. “స్మగ్లర్లు ఎన్ని తెలివైన మార్గాలు వెతికినా మా కళ్లు కప్పడం సాధ్యం కాదు. గతంలో మహిళలు చీరల కింద టేపులు కట్టుకుని, బుర్కాలు వేసుకుని మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. ఇప్పుడు ఏకంగా రైలు భోగీ కింద దాచి తెస్తున్నారు. మా బృందాలు ప్రతి చోటా నిశితంగా నిఘా ఉంచాయి” అని తెలిపారు.

ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ఒక బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో బీహార్‌లో ట్యాంకర్లు, అంబులెన్స్‌లు, పోలీస్ వాహనాలు, చివరికి కుర్చీల మధ్యలో కూడా మద్యం దాచి తరలించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


Posted

in

by

Tags: