“పూజ చేయాలి.. ఇవి కొనుక్కురండి!” భర్తను బయటకు పంపిన నకిలీ బాబా.. ఇద్దరు పిల్లలున్న భార్యపై ముఠా సామూహిక అత్యాచారం.. వెన్నులో వణుకు పుట్టించే నిజాలు..!!

మహారాష్ట్రలో కుటుంబంలో శాంతి కలగాలని, భార్య ఆరోగ్యం కుదుటపడాలని భావించి గ్రహశాంతి పూజ చేయించాలని నిర్ణయించుకున్న ఒక దంపతులకు ఊహించని ఘోర పరాభవం ఎదురైంది.

పూజ చేయించడం కోసం భర్త పిలిపించిన పండితుడు తన ఇద్దరు అనుచరులతో కలిసి వారి ఇంటికి వచ్చాడు. పూజా సామగ్రిలో కొన్ని తక్కువయ్యాయని నమ్మబలికి భర్తను మార్కెట్‌కు పంపించిన ఆ నకిలీ బాబాలు.. ఇంట్లో 27 ఏళ్ల భార్య, ఇద్దరు చిన్న పిల్లలు మాత్రమే ఉన్న సమయం చూసి ఆ వివాహితపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు.

భర్త ఇంటికి తిరిగి వచ్చేలోపే ఆ ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పూజారితో పాటు అతని ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు. ఆధ్యాత్మిక నమ్మకాల పేరిట ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.


Posted

in

by

Tags: