పూల కంటే ఎక్కువగా అమ్ముడైన కాండోమ్స్.. 2026 వాలెంటైన్స్‌లో పాత రికార్డులను బద్దలు కొట్టిన భారతీయులు!

భారతదేశ జనాభా వేగంగా పెరుగుతోంది, అదే సమయంలో ప్రజల్లో అవగాహన కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన వాలెంటైన్ వీక్ దీనికి నిదర్శనంగా నిలిచింది. సాధారణంగా ఈ వారంలో పూలు, చాక్లెట్లు, బహుమతులు ఎక్కువగా అమ్ముడవుతాయి. కానీ, ఈ ఏడాది వీటన్నింటినీ మించి కాండోమ్స్ మరియు ఇతర ‘సెక్సువల్ వెల్‌నెస్’ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి.

2025 రికార్డు బద్దలు: క్విక్ కామర్స్ (బ్లింకిట్, జెప్టో వంటి యాప్స్) తాజా నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 7 నుండి 14 మధ్య జరిగిన అమ్మకాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున సెక్సువల్ వెల్‌నెస్ ఉత్పత్తుల కొనుగోలు 3 రెట్లు పెరిగింది. గతంలో ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడని ప్రజలు, ఇప్పుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీటిని ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

బ్యూటీ మరియు పర్సనల్ కేర్: కేవలం వెల్‌నెస్ ఉత్పత్తులే కాకుండా, మేకప్ మరియు బాడీ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. సూరత్‌కు చెందిన ఒక కస్టమర్ ఏకంగా ₹10,845 విలువైన హెయిర్ కేర్ మరియు బాడీ కేర్ ఉత్పత్తులను ఆర్డర్ చేయగా, మరొకరు ₹15 వేల కంటే ఎక్కువ విలువైన మేకప్ వస్తువులను కొనుగోలు చేశారు.

నగరాల వారీగా సందడి:

  • కోల్‌కతా: ఒక కస్టమర్ ఏకంగా ₹25 వేల విలువైన చాక్లెట్లను ఆర్డర్ చేశారు.
  • టెడ్డీ డే: సాఫ్ట్ టాయ్స్ (టెడ్డీ బేర్స్) అమ్మకాలు 568 శాతం పెరిగాయి.
  • బెంగళూరు: వాలెంటైన్ కార్డ్స్ కొనుగోలులో బెంగళూరు నగరం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది.

Posted

in

by

Tags: