పెళ్లికి అమ్మాయిలు దొరక్క చైనా యువకుల వింత ప్రయత్నాలు.. తీవ్రంగా హెచ్చరించిన ప్రభుత్వం!

బీజింగ్: చైనాలో పెళ్లికి వధువులు దొరక్క అల్లాడిపోతున్న యువకులు, మోసగాళ్ల చేతిలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారట.

ముఖ్యంగా బంగ్లాదేశ్ మహిళలు, చైనా యువకులను ముగ్గులోకి దంపి భారీ మొత్తంలో డబ్బులు గుంజేస్తున్నారట. దీంతో తమ దేశ యువకులను ఉద్దేశించి చైనా ప్రభుత్వం బహిరంగంగానే ఒక హెచ్చరిక జారీ చేసింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో భారతదేశం తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా మొదటి స్థానంలో ఉన్న చైనా.. కఠినమైన జనాభా నియంత్రణ నిబంధనలను తీసుకువచ్చి జనాభాను అదుపు చేసింది. అయితే ఈ నిబంధనల వల్ల చైనా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇతర ఇబ్బందులు వేరే కథ..

అమ్మాయిలు దొరక్క తిప్పలు అక్కడ పురుషులకు సమానంగా మహిళల నిష్పత్తి లేకపోవడంతో, పెళ్లికి అమ్మాయిలు దొరక్క చైనా యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలో 90స్ కిడ్స్‌కే పెళ్లిళ్లు కావడం లేదనుకుంటే, చైనాలో పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉందట. గత 2020 జనాభా లెక్కల ప్రకారం, చైనాలో మహిళల సంఖ్య కంటే పురుషుల సంఖ్య 2 కోట్లు ఎక్కువగా ఉందట.

చైనీయులను ముంచుతున్న బంగ్లాదేశ్ మహిళలు ఈ కారణంగానే అక్కడ ఈ సంక్షోభం నెలకొంది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఆరాటంతో చైనా యువకులు నిరుపేద దేశాలకు చెందిన యువతులను వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా భారతదేశ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. తమకు నచ్చిన వధువును వెతకడం కోసం కొందరు యువకులు చైనా కరెన్సీ ప్రకారం వేలాది యువాన్లను ఖర్చు చేస్తున్నారు.

కానీ, దీనిని ఆసరాగా చేసుకుని అక్కడ భారీ మోసాలు కూడా జరుగుతున్నాయి. పెళ్లి చేసుకుంటామని చైనీయులను నమ్మించే విదేశీ మహిళలు, డబ్బు అందగానే ఇక్కడి నుండి చెక్కేస్తున్నారట. దీనివల్ల చైనా యువకులు ఎక్కువగా మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో, చైనా తన దేశ యువకులకు అత్యవసరంగా ఒక హెచ్చరిక జారీ చేసింది.

అందాన్ని చూసి మోసపోవద్దు విదేశాల్లో జరిగే పెళ్లిళ్ల మోసాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ (ఆర్థిక లేదా శారీరక ప్రయోజనాల కోసం మనుషులను అక్రమంగా రవాణా చేయడం) వంటి వాటిలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో పరిచయమైన వారిని నమ్మి మోసపోకండి. చట్టవిరుద్ధమైన వివాహాలు చేసుకోవద్దు. ముఖ్యంగా బంగ్లాదేశ్ మహిళల అందాన్ని చూసి మోసపోవద్దు. విదేశీ మహిళలను ఇలా పెళ్లి చేసుకోవడానికి చట్టపరమైన గుర్తింపు లేదు.

కాబట్టి, పెళ్లి ఆశతో వధువుల కోసం బ్రోకర్ల ద్వారా కానీ, ఏజెన్సీల ద్వారా కానీ వెళ్లేవారు అరెస్ట్ చర్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బంగ్లాదేశ్ చట్టం ప్రకారం, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి నేరాలకు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,00,000 టాకాల జరిమానా విధిస్తారు. అవసరమైతే మరణశిక్ష విధించడానికి కూడా ఆ దేశ చట్టంలో నిబంధన ఉంది.

ఇతర దేశాలు కూడా హెచ్చరించాయి! అంతర్జాతీయ వివాహాలు అనేవి పరస్పర అంగీకారం మరియు నిజమైన ఆకర్షణ ఆధారంగా జరగాలి. వధువును డబ్బు పెట్టి కొనడం అనేది తరచూ డబ్బు కోసం బెదిరింపులకు గురిచేయడానికి మరియు శారీరక ప్రమాదాలకు దారి తీస్తుంది’ అని పేర్కొంది. దీనికి ముందే వియత్నాం, మయన్మార్, లావోస్, పాకిస్తాన్, నేపాల్ దేశాల్లోని చైనా రాయబార కార్యాలయాలు (ఎంబసీలు) కూడా తమ దేశ ప్రజలను హెచ్చరించడం గమనార్హం.


Posted

in

by

Tags: