“పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు”.. ప్రముఖ జానపద కళాకారిణి ఆత్మహత్యాయత్నం.. షాకింగ్ ఘటన వెనుక అసలు కారణం ఇదేనా..!!

ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌ తన ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

మాధురి ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రక్షించి, సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ తీవ్ర చికిత్స అందుతున్నట్లు సమాచారం.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నృత్య కళాకారుడు ఈశ్వర్ సాయి మోసం చేశాడని మాధురి ఆరోపించారు. ఈ విషయంపై తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఈశ్వర్ సాయిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రేమలో మోసపోయాననే ఆవేదనతో పాటు, పోలీసుల నుంచి సరైన స్పందన లభించలేదన్న బాధ కారణంగా మాధురి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాధురి చేసిన ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.


Posted

in

by

Tags: