ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వరుడిపై వచ్చిన ఆరోపణలతో పెళ్లి ఆగిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎటా జిల్లాకు చెందిన యువతికి, ఫిరోజాబాద్‌కు చెందిన యువకుడితో ఫిరోజాబాద్‌లో వివాహం నిశ్చయమైంది.
పెళ్లి తంతు ప్రారంభమైన సమయంలో, వరుడిపై వధువు అకస్మాత్తుగా ఆరోపణలు చేయడంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. తనను పెళ్లి చేసుకోబోయే యువకుడు మరో అమ్మాయిని ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి, అరగంట పాటు అక్కడే ఉన్నాడని వధువు ఆరోపించింది.
ఈ ఆరోపణ తర్వాత, ఆ యువతి ఈ పెళ్లి చేసుకోనని కరాఖండిగా తేల్చిచెప్పింది. ఇరు కుటుంబాల వారు ఆమెకు ఎంతగానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోకుండా వివాహానికి నిరాకరించింది.
దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ కూడా చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారం లభించకపోవడంతో, చివరకు వరుడు పెళ్లి చేసుకోకుండానే ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
పెళ్లి సమయంలో జరిగిన ఈ ఘటన, ఆ తర్వాత చోటుచేసుకున్న గందరగోళం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరు కుటుంబాలు, బంధువుల మధ్య ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Leave a Reply