పెళ్ళి చేసుకునే అమ్మాయిలారా.. నా జీవితమే మీకు పాఠం; కన్నీటితో పద్మ ఆఖరి లేఖ

ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే అమ్మాయిలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక గుణపాఠం లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసింది. బాధ్యత లేకుండా తిరిగే యువకులను ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయిలు జీవితంలో ఎంతటి ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొంటారో ఈ ఘటన నిదర్శనం.

అసలేం జరిగిందంటే: ఆంధ్రప్రదేశ్ పుత్తూరు మండలం నేసనూరుకు చెందిన కన్నప్ప రెడ్డి కుమార్తె పద్మ (28) డిగ్రీ చదువుతున్న సమయంలో శివశంకర్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయితే, పెద్దల మాటను కాదని 2019లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజ (6), లాస్య (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బాధ్యత లేని భర్త: శివశంకర్ పెళ్లయినప్పటి నుండి సరిగ్గా పనికి వెళ్లకుండా జులాయిగా తిరిగేవాడు. పైగా విలాసాల కోసం పలు చోట్ల అప్పులు చేశాడు. దీంతో పద్మ కుటుంబ భారంతో సతమతమయ్యేది. ఇద్దరు పిల్లల పెంపకం కష్టంగా మారింది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

వేధింపులు – అవమానం: పద్మ మహిళా సంఘాల్లో తీసుకున్న అప్పును తీర్చలేకపోయింది. అప్పు కట్టకపోవడంతో తోటి సభ్యులు ఆమెను అందరిముందూ తిట్టి అవమానించారు. అప్పు తీర్చడానికి భర్త డబ్బు ఇవ్వకపోవడంతో పద్మ తీవ్ర మనోవేదనకు గురైంది.

అఘాయిత్యం: మనస్తాపానికి గురైన పద్మ, తన ఇద్దరు బిడ్డలను ఉరివేసి చంపి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త శివశంకర్, తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి చూడగా, భార్య మరియు పిల్లలు శవాలై వేలాడుతూ కనిపించారు.

పద్మ రాసిన డెత్ నోట్: పోలీసులకు లభించిన లేఖలో పద్మ ఇలా రాసింది: “తల్లిదండ్రుల మాట వినకుండా నచ్చిన వారిని పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయికి నా జీవితమే ఒక పాఠం. శివశంకర్.. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నేను అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం. నా పిల్లలు కూడా ఈ కష్టాలను అనుభవించకూడదనే నేను సెలవు తీసుకుంటున్నాను.”


Posted

in

by

Tags: