పొడిబారిన, పగిలిన పాదాలకు నాచురల్ టిప్స్… మీ వంటింట్లో ఉండే ఈ వస్తువు చాలు!

శీతాకాలంలో చర్మం పొడిబారడం, ముఖంపై పగుళ్లు రావడం సాధారణ సమస్యలు. అయితే, వీటికంటే ఎక్కువ నొప్పిని, అసౌకర్యాన్ని కలిగించే సమస్య పాదాల పగుళ్లు (Heel Cracks). ఇది నడవడాన్ని కష్టతరం చేయడమే కాకుండా పాదాల అందాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీని కోసం చాలామంది ఖరీదైన క్రీములు వాడుతుంటారు. కానీ, మన వంటింట్లో దొరికే సహజ వస్తువులతోనే దీనికి విరుగుడు కనిపెట్టవచ్చు.

కావలసిన వస్తువులు: వేరుశెనగ పొట్టు, కొబ్బరి నూనె, తేనె మరియు పచ్చి పాలు. ఎండిన వేరుశెనగ పొట్టులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను (Dead skin cells) తొలగించి, తేమను తిరిగి రావడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె, తేనె చర్మాన్ని మృదువుగా మార్చగా, పచ్చి పాలు చర్మానికి మంచి తేమను అందిస్తాయి.

తయారీ విధానం:

  1. ఎండిన వేరుశెనగ పొట్టును మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
  2. ఈ పొడిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె, అర స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.
  3. కొద్దిగా పచ్చి పాలు పోసి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

ఉపయోగించే పద్ధతి:

  • మొదట మీ పాదాలను గోరువెచ్చని నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టండి.
  • తయారు చేసుకున్న పేస్ట్‌ను పగుళ్లు ఉన్న చోట రాసి, 5-7 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయండి.
  • ఆ తర్వాత 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి, చల్లని నీటితో కడిగేయండి.
  • చివరగా మాయిశ్చరైజర్ రాసి సాక్సులు (Socks) వేసుకోండి.
  • వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే మీ పాదాలు పట్టులా మెత్తగా మారుతాయి.

Posted

in

by

Tags: