“పొలాల్లో రాసలీలలు, నగ్నంగా పరుగెత్తిన భార్య”: రక్తపు మడుగులో ప్రియుడు.. అర్ధరాత్రి వేళ ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం!

తెలంగాణ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లో వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఒక భీకర హత్యోదంతం సంచలనం సృష్టించింది.

నేపథ్యం: సాయిలు – వినోద దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సాయిలు, ఆమెపై నిఘా ఉంచాడు. ఘటన జరిగిన రోజు రాత్రి, toilet నెపంతో వినోద ఇంటి నుండి బయటకు వెళ్లగా.. అనుమానం వచ్చిన సాయిలు ఒక గొడ్డలిని తీసుకుని ఆమెను రహస్యంగా అనుసరించాడు.

ఘటన జరిగిన తీరు: చీకటిగా ఉన్న పొలాల్లో వినోద తన ప్రియుడు బాలేష్‌తో కలిసి ఏకాంతంగా ఉండటాన్ని సాయిలు కళ్లారా చూశాడు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో, తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో బాలేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తలకి బలమైన గాయాలు కావడంతో బాలేష్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

భయంతో పారిపోయిన భార్య: తన కళ్ల ముందే ప్రియుడు దారుణంగా హత్యకు గురవ్వడం చూసి షాక్‌కు గురైన వినోద, ప్రాణభయంతో కట్టుబట్టల మీద కూడా ధ్యాస లేకుండా నగ్నంగానే అక్కడి నుండి చీకట్లోకి కేకలు వేస్తూ పారిపోయింది. హత్య చేసిన వేగంతోనే సాయిలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో అక్కడి పోలీసులు విస్మయానికి గురయ్యారు.

ప్రస్తుత పరిస్థితి: పోలీసులు సాయిలును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాలేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. అయితే, నగ్నంగా పారిపోయిన వినోద ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఎక్కడికి వెళ్లింది? ప్రాణాలతోనే ఉందా? అన్నది ఇంకా తెలియలేదు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: