“పోలీసులకే కళ్లుగప్పుతున్న 150 మంది చైనీయులు!” స్థానిక మహిళలను అడ్డుపెట్టుకుని చైనీయులు పన్నిన భారీ కుట్ర. బంగ్లాదేశ్‌లో బయటపడిన అంతర్జాతీయ భారీ మోసం.!!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో గత కొద్ది నెలలుగా సుమారు 150 మంది చైనా యువతీయువకులు చేతుల్లో రెండు మొబైల్ ఫోన్లు పట్టుకుని వీధుల్లో, పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.

ఒక ఫోన్‌లో నిరంతరం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న వీరు, మరో ఫోన్ సహాయంతో రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వీడియోలు రికార్డ్ చేస్తున్నారు.

విదేశీయులు ఎందుకిలా తిరుగుతున్నారో అర్థం కాక అయోమయానికి గురైన స్థానికులు, వారు జర్నలిస్టులు లేదా గూగుల్ కంపెనీ కోసం పనిచేసే వారని భావించారు. కానీ, ఆరా తీయగా వీరు విచాట్ (WeChat), డౌయిన్ (Douyin) వంటి చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ చేస్తూ డబ్బు సంపాదించడానికే ఇలా తిరుగుతున్నారని తెలిసింది.

దీని కోసం వారు స్థానిక మహిళలను గైడ్‌లుగా కూడా నియమించుకున్నారు. అయితే, వీరి వెనుక ఉన్న అతిపెద్ద మోసం ఏమిటంటే.. ఢాకాలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేద ప్రజల ఇళ్లను చూపిస్తూ, తాము భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్నామని చైనాలోని వీక్షకులకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.

ముఖ్యంగా, మియాన్ మియాన్ అనే చైనా మహిళ అక్కడి ఇళ్లను విమర్శిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. వాంగ్ వెయ్ అనే మరో వ్యక్తి, రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో టీ తాగుతున్న వారిని వీడియో తీసి, వారు “ఆవు మూత్రంతో చేసిన టీ తాగుతున్నారు” అని కించపరిచేలా, అబద్ధపు సమాచారాన్ని ప్రచారం చేస్తూ హద్దులు దాటాడు. అంతేకాకుండా, స్థానికుల అనుమతి లేకుండా వారి ఇళ్లలోకి, వ్యక్తిగత గదుల్లోకి చొరబడి వీడియోలు తీస్తుండటంతో మహిళలు, కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.

ప్రజలు దీనిని ఖండిస్తూ నిలదీస్తే, ఇంగ్లీష్ రానట్లుగా నటించి నవ్వి వెళ్లిపోతున్నారు. దీనిపై ఉత్తరా పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, భాషా సమస్య, వారి అసలు ఉద్దేశం ఏమిటో వెంటనే తెలియకపోవడం వల్ల పోలీసులు ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, వ్యతిరేకతను రేకెత్తించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *