“పోలీసులే కోర్టు ఉత్తర్వులు లేకుండా అరాచకం చేస్తేనా?”. ఆస్తి తగాదాలో హద్దులు దాటిన అధికారి. కలకలం రేపిన ఘటన..!!!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా, ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఆస్తి మరియు భూ పంపిణీకి సంబంధించి సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది.

ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇరువర్గాలకు సర్దిచెప్పడమే కాకుండా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించి వెళ్ళిపోయారు.

అయితే, ఈ చర్య తర్వాత సదరు ప్రాంతానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఆయనతో వచ్చిన ఒక కానిస్టేబుల్ మళ్ళీ అకస్మాత్తుగా ఆ ప్రాంతానికి వెళ్లారు.

ఎలాంటి కోర్టు ఉత్తర్వులు గానీ, రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తు అనుమతి గానీ లేకుండా, తామే న్యాయమూర్తుల్లా వ్యవహరిస్తూ అక్కడ నిర్మిస్తున్న గోడను బలవంతంగా కూల్చివేశారు.

సబ్ ఇన్స్పెక్టర్ తన కాలితో గోడను తన్ని కూల్చడం, ఆయనతో వచ్చిన కానిస్టేబుల్ తన చేతిలోని కర్రతో ఇటుకలను తొలగించడం అక్కడ ఉన్న గ్రామస్థులు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

ఈ చర్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అయితే సివిల్ చట్ట నియమాలు తనకు పూర్తిగా తెలియకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని సదరు పోలీస్ అధికారి వివరణ ఇవ్వడం గమనార్హం.


Posted

in

by

Tags: