“పోలీసు చొక్కా పట్టుకుని లాగిన మహిళ..!” రూ.20,000 లంచం అడిగాడని దాడి.. నడిరోడ్డుపై షాకింగ్ ఘటన.. భూవివాదంలో చెలరేగిన ఘర్షణతో ఉద్రిక్తత..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ జిల్లా తిర్వా పరిధిలోని నునారీ గ్రామంలో భూవివాదంపై విచారణకు వెళ్లిన ఓ పోలీసు అధికారి లంచం అడిగాడనే ఆరోపణలతో ఓ మహిళ అతని చొక్కా పట్టుకుని దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సదరు పోలీసు.. తమ భూవివాదాన్ని పరిష్కరించేందుకు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడని, అలాగే సీజ్ చేసిన బైక్‌ను వదిలిపెట్టేందుకు ఇప్పటికే రూ.2,800 తీసుకున్నాడని బాధితుల కుటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది.

అంతేకాకుండా, లంచం డబ్బులు అడుగుతూ సదరు పోలీసు తమ ఇంటి మహిళలపై దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ.. ఆ పోలీసు కాలర్ (చొక్కా) పట్టుకుని ఆవేశంగా దాడికి దిగింది.

పోలీసులు అదుపులోకి తీసుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడిని, ఆ మహిళ మరియు ఆమె బంధువులు విడిపించేందుకు ప్రయత్నించిన క్రమంలోనే ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట విడుదలై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుండగా.. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టారు.


Posted

in

by

Tags: