ప్రజలకు తిండి లేదు… కానీ వీళ్ల కోసం రూ.12 కోట్ల విలాసవంతమైన ప్రత్యేక విమానమా?! అమెరికాలో పాకిస్థాన్‌కు షాక్.. యూఎన్ సమావేశానికి ముందే తీవ్ర నిరసనలు!

ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్‌కు అక్కడ ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.

అమెరికాలోని విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అమెరికా అధికారుల నుంచి ప్రత్యేక స్వాగతం కానీ… ఉన్నత స్థాయి అధికారుల నుంచి పెద్దగా ప్రాధాన్యత కానీ లభించలేదని పాకిస్థాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

దీంతో అమెరికా తమను పూర్తిగా పట్టించుకోలేదంటూ పాకిస్థాన్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే… న్యూయార్క్‌లోని ప్రముఖ పెన్ స్టేషన్ ప్రాంతం వెలుపల పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుదారులు, అక్కడ నివసిస్తున్న పాకిస్థాన్ ప్రజలు కలిసి షెహ్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఏర్పడిన ‘ఫారమ్-47 ప్రభుత్వం’ ఇదేనంటూ వారు ఆరోపించారు.

షెహ్‌బాజ్ షరీఫ్‌ను విమర్శిస్తూ… ఆయనను ‘దొంగ’ అంటూ, ‘చెర్రీ బ్లాసమ్’ అనే పదంతో విమర్శలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

అంతేకాదు… మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.

మరోవైపు, పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మరో అంశం కూడా నిరసనలకు కారణమైంది.

పాకిస్థాన్ జాతీయ విమానయాన సంస్థ PIAను కేవలం 10 బిలియన్ పాకిస్థానీ రూపాయలకే విక్రయించే పరిస్థితి ఉందని చెబుతున్న సమయంలో…

పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ కోసం 12 బిలియన్ పాకిస్థానీ రూపాయల విలువైన విలాసవంతమైన ప్రత్యేక విమానం కొనుగోలు చేయడాన్ని నిరసనకారులు తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల డబ్బును ఇలా విలాసాలకు ఖర్చు చేస్తున్నారంటూ వారు ప్లకార్డులతో ప్రభుత్వాన్ని విమర్శించారు.

అంటే… ఒకవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది.

మరోవైపు… ప్రభుత్వ పెద్దల విలాసాల కోసం భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి సమావేశంలో షెహ్‌బాజ్ షరీఫ్ ప్రసంగించకముందే… న్యూయార్క్ వీధుల్లో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనలు పాకిస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అమెరికాలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆరోపణలు, మరోవైపు న్యూయార్క్‌లో జరిగిన నిరసనలు… యూఎన్ సమావేశానికి ముందే షెహ్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి


Posted

in

by

Tags: