“ప్రజలకు రక్షణనా లేక ప్రాణసంకటమా..?” మార్కెట్‌లోకి దూసుకెళ్లి దుకాణాన్ని ధ్వంసం చేసిన అగ్నిమాపక వాహనం.. పూజా సామాగ్రి కొనడానికి వెళ్లిన దంపతులకు ఘోరం.. ఫైర్ ఇంజిన్ సృష్టించిన భయానక ప్రమాదం..!!

భోపాల్ నగరంలోని న్యూ మార్కెట్ పరిధిలో అగ్నిమాపక శాఖ చేపట్టిన మాక్ డ్రిల్ (భద్రతా ప్రదర్శన) తీవ్ర విషాదానికి దారితీసింది. నియంత్రణ కోల్పోయిన ఓ ఫైర్ ఇంజిన్ దుకాణంలోకి దూసుకెళ్లి ప్రజలను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

సంఘటన జరిగిన రోజున తన భర్తతో కలిసి పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వచ్చిన సదరు మహిళ, అకస్మాత్తుగా అదుపుతప్పి దూసుకొచ్చిన అగ్నిమాపక వాహనం కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో ఆమె భర్త వీపు భాగానికి సైతం తీవ్ర గాయాలయ్యాయి.

రద్దీగా ఉండే మార్కెట్ వీధిలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా వాహనాన్ని నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమని బాధితురాలితో పాటు అక్కడున్న స్థానిక వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొద్ది రోజుల క్రితం ఆ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెబుతున్నారు. అయితే, ప్రజల రక్షణ కోసం చేపట్టిన భద్రతా ప్రదర్శనే చివరికి ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది.

ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే కీలక ప్రాంతంలో సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు, ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *