“ప్రతిరోజూ అతనొక్కడే గెలిపించలేడు. మిగతా వారు కూడా ఆడాలి!” – అభిషేక్ శర్మపై హర్షా భోగ్లే ఓపెన్ టాక్..!!!

భారత జట్టు యువ డాషింగ్ ఆటగాడు అభిషేక్ శర్మపైనే అన్ని బాధ్యతలు మోపలేమని, జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్ కూడా బాధ్యతాయుతంగా పరుగులు సాధించాలని ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభిప్రాయపడ్డారు.

“అభిషేక్ శర్మ నేటి మ్యాచ్‌లో కాస్త తడబడినట్లు కనిపించాడు. అతను తన రెగ్యులర్ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించలేదు. క్రికెటర్లకు కొన్నిసార్లు ఇలాంటి నిరాశజనకమైన రోజులు ఎదురుకావడం సహజమే. ప్రతిరోజూ అతనే మ్యాచ్ గెలిపిస్తాడని ఆశించలేం. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

హర్షా భోగ్లే తన మాటలను కొనసాగిస్తూ, జట్టు బౌలింగ్ విభాగంపై తీవ్ర విమర్శలు చేశారు:

“ప్రతిసారీ 200లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. మన బౌలింగ్ చాలా దారుణంగా ఉంది; ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాం. పెద్ద టోర్నమెంట్లలో కప్పు గెలవాలంటే, మన బౌలింగ్ విభాగాన్ని వెంటనే మెరుగుపరుచుకోవాలి. లేకుంటే ఇది మనకు చాలా పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది” అని ఆయన హెచ్చరించారు.


Posted

in

by

Tags: