ప్రతి ఇంట్లోనూ ఒక లక్షాదికారి.. మధ్యతరగతి ప్రజల కోసం అద్భుతమైన పొదుపు పథకం!

మధ్యతరగతి ప్రజలకు కుటుంబ ఖర్చులను నిర్వహించడమే ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయడం మరింత కష్టతరమైన పని. తమ సంపాదనలో రోజువారీ ఖర్చులు పోను, మిగిలిన కొద్ది మొత్తాన్ని అత్యవసర కాలంలో ఎవరినీ చేయి చాచకుండా ఉండేలా పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారి కోసం ఒక అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా, ప్రతి నెలా చిన్న మొత్తంలో డిపాజిట్ చేస్తూ రూ. 1 లక్ష నుండి రూ. 10 లక్షల వరకు నిధిని సమకూర్చుకోవచ్చు. దీని పేరే ‘హర్ ఘర్ లఖ్‌పతి’ పథకం. ఇది నిజానికి ఎస్‌బీఐ అందించే ఒక రకమైన రికరింగ్ డిపాజిట్ (RD) పథకం.

ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ పథకం కింద రూ. 10 లక్షల నిధిని జమ చేయడానికి వివిధ కాలపరిమితులకు నెలకు ఎంత చెల్లించాలో ఇక్కడ చూడండి:

  • 10 ఏళ్లలో రూ. 1 లక్ష పొందడానికి: నెలకు కేవలం రూ. 593 ఆదా చేయాలి.
  • 3 ఏళ్లలో రూ. 10 లక్షలు జమ చేయడానికి: నెలకు రూ. 25,020 పెట్టుబడి పెట్టాలి.
  • 4 ఏళ్లలో రూ. 10 లక్షలు జమ చేయడానికి: నెలకు రూ. 18,120 చెల్లించాలి.
  • 5 ఏళ్లలో రూ. 10 లక్షలు జమ చేయడానికి: నెలకు రూ. 13,910 చెల్లించాలి.
  • 10 ఏళ్లలో రూ. 10 లక్షలు సంపాదించడానికి: నెలకు రూ. 5,760 పెట్టుబడి పెట్టాలి.

పన్ను నిబంధనలు: ఆర్డీ (RD) ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం రూ. 40,000 వరకు ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ. 50,000 వరకు ఉంటుంది. ఈ పరిమితి దాటిన ఆదాయంపై 10 శాతం TDS వర్తిస్తుంది.

పన్ను ఆదా చేయడం ఎలా? మీరు పన్ను పరిధిలోకి రాకపోతే, బ్యాంక్ మీ వడ్డీపై TDS కోత విధించకుండా ఉండటానికి ఫారం 15G లేదా 15H సమర్పించాలి. సీనియర్ సిటిజన్లు ఫారం 15H, ఇతరులు ఫారం 15G ని బ్యాంకులో దాఖలు చేయాల్సి ఉంటుంది.


Posted

in

by

Tags: