ప్రవర్తనపై అనుమానంతో భార్యను కొట్టేవాడు.. తాగి ఒళ్లు తెలియక తన్నేవాడు.. తనకంటే ఆమె బాగా సంపాదిస్తోందన్న అహంకారంతో హింసించేవాడు.. ఆస్తి కోసం కన్నతల్లిని వృద్ధాశ్రమంలో వదిలేసేవాడు.. వయసుతో సంబంధం లేకుండా క్రూరంగా అత్యాచారం చేసి చంపేవాడు.. వీళ్లందరూ ఒక్కసారి స్త్రీ పునర్జన్మ అని పిలిచే ‘ప్రసవ గది’కి వెళ్లి తిరిగి రావాలి.
భర్త ముందు కూడా ఉండలేని ఆ స్థితిలో, ఒంటిపై కేవలం ఒక గుడ్డ.. వెన్నెముకలో నెమ్మదిగా గుచ్చే ‘స్పైనల్ అనస్థీషియా’ అనే రాక్షసుడు.. ముఖం పాలిపోయి, పెదవులు కొరుక్కుంటూ ప్రాణాపాయ స్థితిలో చేసే పోరాటం.
డాక్టర్లు పదేపదే పొట్టపై ఒత్తిడి తెస్తుంటే, నడుము భాగంలో తీవ్రమైన నొప్పి.. అది ఎలా ఉంటుందంటే, కత్తితో వెన్నెముకలోని డిస్కుల మధ్య పొడిస్తే ఎంతటి నరకం ఉంటుందో అంతటి నొప్పి! యోని భాగం బిడ్డ బయటకు రావడానికి తగినంత వెడల్పు కానప్పుడు, శస్త్రచికిత్స పరికరాలతో చేసే ఆ చీలిక.. ఒక కొబ్బరికాయను పగలగొట్టడానికి ఉపయోగించే పరికరంలా ఆ అవయవాన్ని చీల్చి చేసే ఆ ప్రక్రియ వర్ణనాతీతం.
“బిడ్డను చూడాలంటే గట్టిగా ముక్కాలి” అని డాక్టర్లు అంటుంటే, తన నరాలన్నింటినీ బిగబట్టి, శరీరంలోని శక్తిని అంతా ఒకచోట చేర్చి చేసే ఆ ముక్కుడు.. చివరికి ప్రాణాలను పణంగా పెట్టి, ఆ అవయవాన్ని చీల్చుకుంటూ బిడ్డ బయటకు వచ్చినప్పుడు కలిగేది ఒక పునర్జన్మ!
అంతటి మరణయాతన అనుభవించినా, ఆ పసిబిడ్డ ముఖం చూడగానే ఆ నొప్పులన్నీ మర్చిపోయి నవ్వే దేవత స్త్రీ. ఆ తర్వాత వేసే కుట్లు, మూత్ర విసర్జన చేసేటప్పుడు కలిగే ఆ మంట.. అది మరణ వేదనతో సమానం. కొన్నిసార్లు కూర్చోవడానికి కూడా వీలుపడదు.
ఇది చదువుతుంటేనే మనసు కన్నీటితో తడిసిపోతోందా? అయితే ఇంతటి నరకాన్ని భరించి మనకు ప్రాణభిక్ష పెట్టే స్త్రీలను తల మీద పెట్టుకుని పూజించాలి. అలాంటి వారిని కొట్టడం, హింసించడం, అత్యాచారం చేయడం.. ఛీ! ఇప్పటికైనా మారండి!
