ప్రపంచంలోని టాప్ 25 బీచ్‌లలో గోవాకు చెందిన పాలోలెం బీచ్.! ఆసియాలోనే ప్రథమ స్థానం. ఈ బీచ్‌లో అంత స్పెషల్ ఏంటో తెలుసా.?

గోవా అనగానే అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే పర్యాటక ప్రాంతాలే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో, గోవాలోని పాలోలెం బీచ్ (Palolem Beach) ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా ఎంపికైన ఈ ప్రదేశం, ప్రపంచంలోని టాప్ 25 బీచ్‌ల జాబితాలో కూడా చోటు దక్కించుకుంది.

2026 సంవత్సరానికి గాను ప్రకటించిన గ్లోబల్ బీచ్ ర్యాంకింగ్స్‌లో పాలోలెం బీచ్ 6వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని టాప్ 25 బీచ్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా బీచ్ కూడా ఇదే కావడం విశేషం. నిపుణుల సిఫార్సులు, పర్యాటకుల అభిప్రాయాలు, సముద్రపు నీటి రంగు, స్పష్టతతో సహా 18 అంశాల ఆధారంగా ఈ ఎంపిక జరిగింది.

దక్షిణ గోవాలోని కెనకోనా (Canacona) ప్రాంతంలో ఉన్న పాలోలెం బీచ్, అర్ధచంద్రాకారంలో ఉండే తీరం, తెల్లటి ఇసుక తిన్నెలు, వరుసగా ఉండే కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన సముద్రపు నీటితో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రకృతి అందాలతో పాటు అత్యుత్తమ పర్యాటక అనుభూతిని అందిస్తుండటంతో ప్రపంచ నలుమూలల నుంచి ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఇక్కడ సముద్రంలో ఈత కొట్టడం, కయాకింగ్ (పడవ ప్రయాణం), డాల్ఫిన్లను చూసేందుకు బోట్ రైడింగ్, సమీపంలోని జలమార్గాలను సందర్శించడం వంటి అద్భుతమైన అనుభవాలను పొందవచ్చు. అంతేకాకుండా, బీచ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, రెస్టారెంట్లు, విశ్రాంతి సదుపాయాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పర్యావరణం, స్థానికుల జీవనోపాధి, సాంస్కృతిక గుర్తింపులను పరిరక్షిస్తూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంపై గోవా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *