మోస్ట్ ఇండెటెడ్ కంట్రీ (Most Indebted Country): జనవరి 2026 గణాంకాలు మరియు 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ అప్పు కలిగిన దేశంగా అమెరికా నిలిచింది. అమెరికా మొత్తం అప్పు సుమారు 38.3 ట్రిలియన్ డాలర్లు. పెరుగుతున్న సైనిక వ్యయం మరియు సంక్షేమ పథకాలు దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
ఈ జాబితాలో చైనా రెండో స్థానంలో ఉంది. చైనా ప్రభుత్వ అప్పు సుమారు 18.7 ట్రిలియన్ డాలర్లు. మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఆర్థిక ఉద్దీపన పథకాల కోసం చైనా భారీగా అప్పులు చేసింది. ఇక జపాన్ 9.8 ట్రిలియన్ డాలర్ల అప్పుతో మూడో స్థానంలో ఉంది.
భారతదేశ స్థానం: యూనైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) 4.1 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, ఫ్రాన్స్ 3.9 ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇదే సమయంలో, భారతదేశం సుమారు 3.8 ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ అప్పుతో ఆరో స్థానంలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా పెరుగుదల మరియు వివిధ ప్రభుత్వ వ్యయాలు భారతదేశ అప్పు పెరగడానికి కారణమయ్యాయి.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం అప్పు మొత్తమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధి మరియు ఆ అప్పును తీర్చగల సామర్థ్యం (Debt-to-GDP ratio) కూడా చాలా ముఖ్యం.
