ముంబై: రాజీ కోటలు, కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్‌లను పక్కన పెట్టి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈరోజు ముంబైలోని ‘మెరైన్ డ్రైవ్’లో జోగింగ్ చేస్తూ కనిపించారు. భారత్‌లో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న మాక్రాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన సామాన్య ముంబైకర్లలాగే మెరైన్ డ్రైవ్ తీరంలో పరుగెత్తుతూ కనిపించారు.
మొదట మెరైన్ డ్రైవ్‌లో వాకింగ్ చేస్తున్న పౌరులకు తమ పక్కన పరుగెడుతున్న వ్యక్తి ఫ్రాన్స్ అధ్యక్షుడు అని అసలు గుర్తు పట్టలేకపోయారు. అయితే కొంత సమయం తర్వాత ఆయనను గుర్తించగానే అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి అభద్రతా భావం లేకుండా ముంబై వీధుల్లో జోగింగ్ చేయడం చూసి అందరూ అవాక్కయ్యారు.
ముంబైకర్ల కెమెరాల్లో ఆ దృశ్యం: మాక్రాన్‌ను గుర్తించిన తర్వాత, మార్నింగ్ వాక్ కోసం వచ్చిన ముంబైకర్లు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేయగా, మరికొందరు ఆయనకు అభివాదం చేశారు. మాక్రాన్ కూడా ముంబైకర్ల ఉత్సాహానికి చిరునవ్వుతో స్పందించారు. ఆయన వెంట సాదా దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది కూడా జోగింగ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి ముంబై జోగింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.
