కరోనా వైరస్ కొత్త జన్యు రూపాంతరమైన ‘PJ.2.1’ వేరియంట్ ప్రపంచంలోని పలు దేశాల్లో వెలుగుచూసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
ఈ కొత్త వైరస్ బారిన పడిన వారికి జ్వరం, ఎడతెగని దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయని పరిశోధకులు తెలిపారు.
ఈ లక్షణాలు సాధారణ జలుబు లేదా సీజనల్ ఫ్లూ (జ్వరం) లక్షణాల లాగే ఉండటం వల్ల, వైద్య పరీక్షలు చేయకుండా ఇది ఏ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించడం కష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, ఈ వేరియంట్ గత వేరియంట్ల కంటే తీవ్రమైన ముప్పును లేదా అధిక ప్రాణనష్టాన్ని కలిగిస్తుందనడానికి తగిన ఆధారాలు లేవు.
అయినప్పటికీ, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని.. తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించింది.

Leave a Reply