“ప్రపంచ దేశాలను మోసం చేస్తున్న చైనా కుయుక్తులు బట్టబయలు!” నాసిరకం ఆయుధాలతో పాకిస్థాన్ తర్వాత బంగ్లాదేశ్‌కూ భారీ దెబ్బ.. సంచలన నివేదిక..!!!

ప్రపంచవ్యాప్తంగా చౌక ధరలకు ఆయుధాలను విక్రయిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాల రక్షణ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని చూస్తున్న చైనా ‘మేడ్-ఇన్-చైనా’ యుద్ధ సామాగ్రి డొల్లతనం, ప్రమాదం మరోసారి అంతర్జాతీయ వేదికపై బట్టబయలయ్యాయి.

ఇప్పటికే పాకిస్థాన్ సైన్యానికి చైనా సరఫరా చేసిన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఫిరంగులు అనేక సందర్భాల్లో యుద్ధ రంగంలోనూ, విన్యాసాల సమయంలోనూ మొరాయించి నిరుపయోగంగా మారి పాకిస్థాన్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

ఆ కోవలోనే తాజాగా బంగ్లాదేశ్ సైన్యం ఉపయోగిస్తున్న చైనా తయారీ ట్యాంక్ ఒకటి, వార్ ట్రైనింగ్ విన్యాసాల సమయంలో హఠాత్తుగా పేలిపోయి ఇద్దరు సైనికుల ప్రాణాలను బలిగొన్న ఘటన ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ పరిధిలోని హత్హజారీ శిక్షణా మైదానంలో, చైనా తయారీ ‘టైప్ 59’ శ్రేణి ట్యాంకుతో సైనికులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని రీతిలో ట్యాంక్ లోపలే గుండు పేలిపోవడంతో, అందులో ఉన్న ఇద్దరు సైనికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

అంతేకాకుండా, వారితో ఉన్న ఒక ఉన్నతాధికారి తీవ్రంగా గాయపడటంతో, హెలికాప్టర్ ద్వారా ఆయనను ఢాకా మిలిటరీ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వ్యాపించి అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

తక్కువ ధర వస్తుందన్న ఆశతో చైనా ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలకు ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరికగా మారింది. పాకిస్థాన్ సైన్యం చైనా నేవీ బోట్లు, యుద్ధ విమానాల్లోని సాంకేతిక లోపాల కారణంగా ఇప్పటికే భారీ నష్టాలను చవిచూస్తుండగా, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం చైనా ఆయుధాల విశ్వసనీయతను పూర్తిగా ప్రశ్నార్థకం చేసింది.

ప్రాణాలు కాపాడాల్సిన ఆయుధాలనే ఇంత నాసిరకంగా తయారుచేసి ప్రపంచ దేశాలను బురిడీ కొట్టిస్తున్న చైనాను ఇకపై ఏ దేశం మాత్రం నమ్ముతుంది?’ అంటూ ఘాటైన ప్రశ్నలతో పాటు, చైనా రక్షణ రంగంపై అంతర్జాతీయ విమర్శలు ఇంటర్నెట్‌తో పాటు భద్రతా వర్గాల్లో తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.


Posted

in

by

Tags: