ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో 145 దేశాల యుద్ధ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ ‘గ్లోబల్ ఫైర్‌పవర్’ 2026 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద సైనిక శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మరోవైపు, పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు ఇది నిరాశ కలిగించే వార్త. ఆ దేశ ర్యాంకింగ్ వరుసగా మూడవ ఏడాది కూడా పడిపోయింది.
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన దేశాలు: గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ (PwrIndx)లో స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత శక్తివంతమైనదని అర్థం.
టాప్ 5 దేశాలు (మార్పు లేదు):
- అమెరికా: ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
- రష్యా: 0.0791 స్కోరుతో ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక శక్తిగా నిలిచింది.
- చైనా: 0.0919 స్కోరుతో మూడవ స్థానంలో స్థిరంగా ఉంది.
- భారత్: ప్రపంచంలోనే నాలుగో శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని కాపాడుకుంది.
- దక్షిణ కొరియా: ఐదో స్థానంలో నిలిచి తన బలాన్ని చాటుకుంది.
ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్న దేశాలు:
- ఫ్రాన్స్: 2024లో 11వ స్థానంలో ఉన్న ఫ్రాన్స్, ఇప్పుడు 6వ స్థానానికి చేరుకుంది.
- జపాన్: ఒక మెట్టు ఎక్కి 7వ స్థానంలో నిలిచింది.
- జర్మనీ: ఈ ఏడాది అతిపెద్ద ‘సర్ప్రైజ్’ జర్మనీయే. 2024లో 19వ స్థానంలో ఉన్న ఈ దేశం, ఏకంగా 12వ స్థానానికి ఎగబాకింది.
- ఇటలీ: 10వ ర్యాంకుతో టాప్-10లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
భారత్ బలం – పాకిస్థాన్ బలహీనత: భారత్ తన సైనిక శక్తి, వ్యూహాత్మక వనరులు మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద స్వదేశీ ఆయుధాల తయారీతో తన ర్యాంకును పదిలం చేసుకుంది. కానీ పాకిస్థాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. 2024లో 9వ స్థానంలో ఉన్న పాకిస్థాన్, 2025లో 12కు, ఇప్పుడు 2026లో 14వ స్థానానికి పడిపోయింది.
