ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.! ఇకపై 2వ పెళ్లి చేసుకుంటే వెంటనే ఉద్యోగం ఊడుతుంది. కలలో కూడా ఇక ప్రభుత్వ ఉద్యోగం దొరకదు. ముఖ్యమంత్రి సంచలన ప్రకటన. ఏ రాష్ట్రంలోనో తెలుసా..?

అస్సాం రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులను తక్షణమే సర్వీసు నుంచి తొలగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేసే దిశగా అస్సాం ప్రభుత్వం ఈ కొత్త చట్ట సవరణను తీసుకువచ్చింది.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం, ‘అస్సాం సర్వీస్ కండక్ట్ రూల్స్ 1964’లో ఈ కీలక సవరణలు చేసింది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) ప్రకారం, మొదటి భార్య జీవించి ఉండగానే లేదా చట్టబద్ధమైన విడాకులు పొందకుండా రెండో పెళ్లి చేసుకునే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా వెంటనే పదవి నుంచి తొలగిస్తారు.

అంతేకాకుండా, ఇలా బహుభార్యత్వానికి (Polygamy) పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరకుండా శాశ్వత నిషేధం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిబంధనల కఠిన అమలు కోసం, సర్వీస్ కండక్ట్ రూల్స్ విభాగంలో కొత్త ఉప-విభాగాన్ని అధికారికంగా చేర్చారు.

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, క్రమశిక్షణను కాపాడే ఉద్దేశ్యంతోనే ఇలాంటి కఠిన చర్య తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఈ సంచలన చట్ట సవరణ అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం, దిగ్భ్రాంతిని రేకెత్తించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *