ముంబైలో క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో, ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో రెండు కార్లు ముఖాముఖి ఢీకొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ప్రమాదం బుధవారం జరిగినట్లు సమాచారం. మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న సమయంలో, అతిథి గృహం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పాటు, వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఒక వార్తా సంస్థ విడుదల చేసింది. అందులో బ్లూ కలర్ (నీలం రంగు) సెడాన్ కారు, వైట్ కలర్ (తెలుపు రంగు) ఫార్చ్యూనర్ కారు.. ఈ రెండు వాహనాలు ఢీకొన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నీలం రంగు కారు ముందు భాగంతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టం దృశ్యాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా, నీలం రంగు ఫార్చ్యూనర్ కారును ఒక వృద్ధుడు నడుపుతున్నట్లు చెబుతున్నారు. మరో కారు ఎలా వచ్చి ఢీకొట్టింది, ప్రమాదం జరగడానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.
క్యాబినెట్ సమావేశం జరుగుతున్న ముఖ్యమైన ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు కార్లు ఢీకొన్న దృశ్యాలు ఇంటర్నెట్లో విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణం, అందులో ఎవరికైనా గాయాలయ్యాయా అనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply