“ప్రాణం కంటే చెప్పులే ముఖ్యమా?” రైల్వే పట్టాలపై నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. వైరల్‌గా మారిన వీడియో!!

సోషల్ మీడియా: భారతీయ రైల్వే పట్టాలపై ప్రజలు ప్రమాదాలను ఏమాత్రం లెక్కచేయకుండా చేసే కొన్ని పనులు తరచుగా చూసేవారిని షాక్‌కు గురిచేస్తుంటాయి.

ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తూ, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు మరియు ఆందోళనకు దారితీసింది. వేగంగా వస్తున్న రైలుకు అత్యంత సమీపంలో ఒక యువకుడు రైల్వే పట్టాలను దాటడానికి ప్రయత్నించాడు. రైలు చాలా దగ్గరకు వచ్చినప్పటికీ, అతను ఏమాత్రం కంగారు పడకుండా పట్టాలు దాటడం చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

అయితే, ఇక్కడే ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. పట్టాలు దాటే తొందరలో, అతని కాలికి ఉన్న చెప్పు ఒకటి ఊడి పట్టాల మధ్యే పడిపోయింది. ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగెత్తాల్సింది పోయి, ఆ వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా, రైలు ఇంజన్ అతన్ని ఢీకొట్టేంత దగ్గరలో ఉండగా, తిరిగి వెనక్కి వచ్చి ఆ చెప్పును తీసుకుని పరుగెత్తాడు. “ఓన్లీ ఇన్ ఇండియా” అనే క్యాప్షన్‌తో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక సాధారణ చెప్పు కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఆ వ్యక్తి చూపిన తెలివితక్కువ ధైర్యాన్ని పలువురు విమర్శిస్తున్నారు.


Posted

in

by

Tags: