“ప్రారంభించక ముందే ఇలా అయిపోయింది”.. రూ.21 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు! ట్రయల్ రన్‌లోనే కుప్పకూలిన భారీ నీటి ట్యాంక్; ముక్కలైన ప్రజల కలలు..!

గుజరాత్ రాష్ట్రం సూరత్ సమీపంలోని తడ్కేశ్వర్ గ్రామంలో సుమారు రూ.21 కోట్ల ఖర్చుతో ఒక భారీ ఓవర్ హెడ్ నీటి ట్యాంక్‌ను నిర్మించారు.

ఈ నీటి ట్యాంక్ ప్రారంభోత్సవానికి ముందే, అధికారులు ప్రయోగాత్మకంగా (Trial Run) అందులో 9 లక్షల లీటర్ల నీటిని నింపారు. అయితే, నీటిని నింపిన కొద్దిసేపటికే భూకంపం వచ్చినట్లుగా ఆ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలి నేలమట్టమైంది.

ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. నిర్మాణంలో నాసిరకం వస్తువులను ఉపయోగించడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, కాంట్రాక్టర్ మరియు ప్రభుత్వ అధికారులతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.


Posted

in

by

Tags: