“ప్రియుడిని చూసేందుకు రాత్రి 3 గంటలకు వచ్చిన యువతి. ఎదురుచూసింది మరణం!” పొలం కంచె దాటుతుండగా శరీరంలోకి ప్రవహించిన విద్యుత్. ప్రియుడి కళ్ల ముందే జరిగిన విషాదం.!

మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో, ప్రియుడిని కలిసేందుకు వేకువజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన 19 ఏళ్ల యువతి, పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.

జవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పక్క గ్రామానికి చెందిన యువకుడితో ఆ యువతి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం వేకువజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఇద్దరూ కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. యువతి ఇంటికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న పొలం వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్న ప్రకారమే యువతి ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి పొలం వద్దకు చేరుకుంది. పొలంలోకి ప్రవేశించేందుకు చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప తీగల కంచెను దాటేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆ తీగలకు విద్యుత్ సరఫరా అవుతుండటంతో, వాటిని తాకిన మరుక్షణమే యువతి విద్యుదాఘాతానికి (కరెంట్ షాక్) గురై అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమెను కాపాడలేకపోయారని సమాచారం.

ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రియుడు, యువతి విద్యుదాఘాతంతో చనిపోవడం చూసి షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఎలాగోలా తేరుకుని, ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, యువతి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అర్ధరాత్రి ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన కూతురు, విగతజీవిగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న జవా పోలీస్ స్టేషన్ పోలీసులు ఉదయం 5 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంటల రక్షణ కోసం పొలం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన పొలం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిపై కూడా ఆరోపణలు చేశారని, ఈ ఘటనలో అతని పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *