“ప్రియుడు చేతులు పట్టుకోగా.. భార్య కాళ్లు పట్టుకుంది..!” దుపట్టాతో భర్త గొంతు నులిమి కిరాతక హత్య.. బయటకు తీయనున్న మృతదేహం.. భార్య రహస్య వాంగ్మూలం వీడియోతో బట్టబయలైన ఘోరం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మేస్త్రీ తాలిబ్ (30) గత సెప్టెంబర్ 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అతడిది సహజ మరణమేనని భార్య ఇల్మా (27) చెప్పడంతో, అది నమ్మిన బంధువులు మృతదేహాన్ని ముజఫర్‌నగర్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి ఖననం చేశారు.

అయితే, తాలిబ్ అంత్యక్రియలు ముగిసిన వెంటనే భార్య ఇంట్లోని విలువైన వస్తువులను మూటగట్టడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా, ఇల్మాకు అమన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. అంతేకాకుండా, తాలిబ్ దుస్తుల మధ్య దాచి ఉంచిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, వారిద్దరి మధ్య జరిగిన రహస్య సంభాషణలు కూడా వెలుగులోకి వచ్చాయి.

దీంతో ఖననం చేయడానికి ముందు తీసిన తాలిబ్ ఫోటోలను నిశితంగా పరిశీలించగా, అతడి మెడపై అనుమానాస్పద గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీసి ప్రశ్నించడంతో, ప్రియుడితో కలిసి తానే భర్తను హతమార్చినట్లు ఇల్మా ఒప్పుకుంది. ఈ దిగ్భ్రాంతికర వాంగ్మూలాన్ని బంధువులు వీడియో తీసి పోలీసులకు అప్పగించారు.

ఆ భార్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఘటన జరిగిన రోజు భర్తతో గొడవ జరగడంతో ప్రియుడు అమన్‌ను ఆమె ఇంటికి పిలిపించింది. అమన్ తన స్నేహితుడితో కలిసి వచ్చి తాలిబ్‌పై దాడి చేశాడు. అనంతరం ప్రియుడు అమన్ దుపట్టాతో తాలిబ్ గొంతు నులుముతుండగా, స్నేహితుడు చేతులను, భార్య కాళ్లను గట్టిగా పట్టుకుని అతడిని అత్యంత పాశవికంగా ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

ప్రస్తుతం లోహియానగర్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు నిరూపించేందుకు, ఖననం చేసిన తాలిబ్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) అనుమతి కోరారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *