“ప్రియురాలితో కారులో షికారు..?” భార్య బోనెట్‌పై వేలాడుతున్నా కారు ఆపని భర్త.. 5 కిలోమీటర్ల మేర కారు బోనెట్‌పై భార్య ఆర్తనాదాలు.. నెట్టింట వైరల్ అవుతున్న భయానక వీడియో..!!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో, తన భర్త వేరొక మహిళతో కారులో వెళ్లడాన్ని చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య.. కారు బోనెట్‌పై 5 కిలోమీటర్ల దూరం ప్రాణభయంతో వేలాడుతూ వెళ్లిన భయానక ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

మీరట్‌లోని ఘాజీపూర్ ప్రాంతానికి చెందిన ఈ దంపతులకు వివాహమై 15 ఏళ్లు కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భార్యతో విభేదించి భర్త వేరుగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, శనివారం నాడు భార్య తన కుమారుడితో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా.. భర్త మరో మహిళతో కారులో వెళ్లడాన్ని చూసింది.

వెంటనే భార్య ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా, భర్త కారును ఆపకుండా మరింత వేగం పెంచాడు. దీంతో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ మహిళ కారు బోనెట్‌పైకి ఎక్కింది. అయినప్పటికీ భర్త కారు ఆపకుండా సుమారు 5 కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా నడిపాడు.

కారు ముందు భాగంలో వేలాడుతూ ఆ మహిళ సాయం కోసం కేకలు వేయడం చూసిన స్థానికులు, 5 కిలోమీటర్ల తర్వాత కారును అడ్డగించి పట్టుకున్నారు. కారు ఆగిన తర్వాత కూడా ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, నడిరోడ్డుపై భార్యను కొడుతూ వీరంగం సృష్టించాడు.

హృదయాలను కలచివేసే ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. బాధితురాలైన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మీరట్ పోలీసులు.. భర్తను, అతనితో పాటు కారులో ఉన్న మహిళను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *