ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలోని దేవ్‌సరా జంక్షన్ వద్ద, అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధన అనే మహిళతో తన భర్త నేత్రపాల్ సింగ్ కారులో వెళ్తుండటాన్ని గోదావరి (38) అనే మహిళ చూసింది.
ఆమె కారును ఆపడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె భర్త కారు ఆపకుండా అలాగే వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో గోదావరి కారు ముందు భాగం (బోనెట్) ను గట్టిగా పట్టుకుని వేలాడటంతో, ఆమెను సుమారు 100 మీటర్ల దూరం వరకు కారు లాక్కెళ్లింది. చివరికి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కారును చుట్టుముట్టి, అడ్డుకుని గోదావరిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై బాధితురాలైన గోదావరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రియురాలు సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను సాధన పూర్తిగా తిరస్కరించింది. తాను బ్లాక్ ఆఫీస్నుం డి తిరిగి వస్తున్న సమయంలో నేత్రపాల్‌ను కేవలం లిఫ్ట్ మాత్రమే అడిగానని, గోదావరి తనను తప్పుగా అర్థం చేసుకుని దాడి చేసిందని ఆమె తెలిపింది.
ఈ ఘటనపై బామోరా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ స్పందిస్తూ.. భర్త నేత్రపాల్ మరియు సాధన ఇద్దరిపై హత్యాయత్నం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, దాడి చేయడం వంటి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply