ప్రియురాలి కోసం చేసిన ఖర్చులు.! “తల్లిదండ్రులు లేని సమయం చూసి ప్లాన్”.. సొంత ఇంట్లోనే లాకర్ పగలగొట్టి చోరీ చేసిన కొడుకు.. విచారణలో తెలిసిన షాకింగ్ నిజాలు.!!

అసోం రాష్ట్రం జోర్హాట్ (Jorhat) ప్రాంతానికి చెందిన దంపతులు కొన్ని రోజులు వేరే ఊరికి వెళ్లిన సమయంలో, వారి సొంత కొడుకే ఇంట్లోని లాకర్‌ను పగలగొట్టి దాదాపు ₹50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించి ప్రియురాలి కోసం ఖర్చు చేశాడు.

ఊరి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు, లాకర్ పగలగొట్టి విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోర్హాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల విచారణలో ఈ చోరీకి పాల్పడింది వారి సొంత కుమారుడేనని బట్టబయలైంది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన నగదు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కన్న కొడుకే సొంత ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *