రాత్రివేళ రహస్యంగా కలుసుకున్న ఓ ప్రేమ జంటను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారని.. అనంతరం ఉదయం వారిద్దరినీ సజీవంగా మట్టిలో పాతిపెడుతున్నారని పేర్కొంటూ ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
“చావులోనూ విడిపోని నిజమైన ప్రేమ” అంటూ పలు తప్పుడు క్యాప్షన్లతో ఈ వీడియోను ఎక్స్ (X)లో విస్తృతంగా షేర్ చేయడంతో.. ఈ ఘటన నిజమేనని నమ్మిన చాలామంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే ఈ వీడియో నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినదేనా అనే అనుమానంతో నెటిజన్లు, ఫ్యాక్ట్చెకర్లు పరిశీలించారు.
ఈ పరిశీలనలో అసలు నిజం బయటపడింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజ జీవిత ఘటన కాదని.. ఓ సినిమా షూటింగ్లో భాగంగా చిత్రీకరించిన సన్నివేశమని గుర్తించారు.
అంటే.. సినిమా చిత్రీకరణ సమయంలో తీసిన వీడియోను తీసుకుని, దానికి తప్పుడు కథనాన్ని జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు స్పష్టమైంది.
ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో నిజమేనని నమ్మకూడదని స్పష్టమవుతోంది. వీడియో ఎక్కడిది? ఎప్పుడు జరిగింది? అసలు సందర్భం ఏమిటి? అనే విషయాలను పరిశీలించిన తర్వాతే షేర్ చేయాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

Leave a Reply